Karnataka logo

Karnataka Tourism
GO UP
Panchajanya Houseboat

ఉడుపిలో హౌస్ బోట్ అనుభవం

separator
  /  ఉడుపిలో హౌస్ బోట్ అనుభవం

మంత్రముగ్దులను చేసే ఉడిపి నది ప్రవాహంలో పడవ ప్రయాణ అనుభవం

భారత రాష్ట్రమైన కర్ణాటకలోని ఉడిపి సుందరమైన దృశ్యాలు మరియు గొప్ప వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది; అయితే, పంచజన్య క్రూజ్ అందించే అసాధారణ అనుభవం గురించి చాలా మందికి తెలియదు. చుట్టూ నీటితో, పచ్చని చెట్ల మధ్య హద్దులు లేని నీలి ఆకాశంతో పడవ ప్రయాణం పర్యటకుల ప్రయాణానికి ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది.

పొడవైన తాటి చెట్ల యొక్క నీడ పడవపై పడి మీకు సౌకర్యాన్ని అందిస్తాయి, ఇది మొత్తం క్రూయిజ్ ప్రయాణాన్ని ఆనందకరమైన అనుభవంగా మార్చుతుంది. బ్యాక్ వాటర్స్ లోని ఈ పడవల ప్రయాణం, పర్యాటకులకు ఉడుపిలో క్లాసిక్ హౌస్ బోట్ రైడ్ లను ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం కల్పిస్తాయి, ఇక్కడే స్వర్ణ, సీత మరియు గంగవాలి నదులు కోడి బెంగ్రేలోని డెల్టా బీచ్ సముద్రతీరంలో కలుస్తాయి. ఈ మూడు నదుల సంగమ స్థానం ఒక అద్భుతమైన మాయాజాలన్నీ సృష్టిస్తుంది, ముఖ్యంగా ప్రయాణ సమయంలో, పడవ నుండి దీనిని వీక్షించవచ్చు.

పంచజన్య క్రూజ్ అనేది ఒక రకమైన బోట్ రైడ్ లాంటిది, ఇది అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను కలిగి ఉంటుంది, ఈ హౌస్ బోట్ అనేది ఒక సాధారణ పడవ ప్రయాణంలాగా కాకుండా కొత్త అనుభవాలను అందిస్తుంది. ఈ క్రూయిజ్ కర్ణాటకలోని ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ గుండా ప్రశాంతంగా ప్రయాణించి, ప్రత్యేకమైన వృక్షజాలం మరియు జంతుజాలాలను అన్వేషించడానికి అవకాశాన్ని అందిస్తుంది. హౌస్‌బోట్‌లో విశాలమైన బెడ్‌రూమ్ ఉంది, సౌకర్యవంతమైన డబుల్ బెడ్, బాత్రూమ్, ఆకట్టుకునే లైటింగ్‌తో పాటు ఎయిర్ కండిషనింగ్ కూడా ఉంది. క్రూయిజ్‌లలో వంటగది కూడా అందుబాటులో ఉంది. పంచజన్య హౌస్‌బోట్లు పర్యాటకులందరికీ ప్రీమియం మరియు విలాసవంతమైన రైడ్ లను అందిస్తామని హామీ ఇస్తున్నారు మరియు నాణ్యత విషయంలో వీరు ఎప్పుడు రాజీపడరు.

మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రయాణిస్తూ మీరు విశ్వం మధ్యలో కూర్చున్నట్లుగా పడవల నుండి కనిపించే దృశ్యం ఉత్కంఠభరితమైనది. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు, మరియు బ్యాక్ వాటర్స్ అంతటా ప్రవహించే తేలికపాటి గాలి మీ శరీరాన్ని చల్లగా తాకుతూ మిమ్మల్ని శుద్ధి చేస్తున్నట్లుగా ఉంటుంది మరియు మీలోని ఆందోళన, ఒత్తిడిని తొలగిస్తుంది. పంచజన్య క్రూయిజ్‌లు ఉడిపిలో మొత్తం ప్రయాణ అనుభవాన్ని అద్భుతంగా మారుస్తాయి.

పంచజన్య అందించే ఆరు రకాల క్రూయిజ్‌లు, వివిధ రేట్లతో ఉన్నాయి. ఈ ప్యాకేజీలలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనవే, అయితే, మీరు అందమైన బ్యాక్ వాటర్స్ మధ్య పడవలో ఎంతసేపు ఉండాలనుకుంటున్నారో దానిపై వాటి ధర ఆధారపడి ఉంటుంది. పంచజన్య క్రూయిజ్‌లు ప్రత్యేకమైనవి మరియు మీరు ఇంతకు ముందు ఎటువంటి అనుభవాన్ని మీరు ఆస్వాదించి ఉండరు. మనోహరమైన సీనరీలు మీకు ఉడిపిని కొత్తగా చూపిస్తుంది, ఇక్కడ ప్రకృతి యొక్క ఆధిపత్యం వాణిజ్య పర్యాటకాన్నీ వెనుకకు నెడుతుంది.

https://panchajanyacruise.com/