Karnataka logo

Karnataka Tourism
GO UP
యనా గుహలు

యానా గుహలకు ట్రిప్

separator
  /  యానా గుహలకు ట్రిప్
Trip To Yana Caves

యానా గుహల రహస్యాలను ఛేదించండి, మరియు మీరే మళ్ళి కనిపెట్టండి

యనా గుహలు ప్రకృతి యొక్క అత్యుత్తమ సృష్టిలో ఒకటి, ఇది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కుమతలో ఉంది, ఈ గుహ ఆకర్షణీయమైనది మరియు చాలా రహస్యమైనది. కటిక చీకటిగా, గుహ కార్స్ట్ సున్నపురాయితో ఏర్పడింది, ఇది దాని ప్రత్యేకమైన నిర్మాణం మరియు ఏర్పడిన విధానానికి ఎంతో ప్రసిద్ది. కుమతలోని అడవుల మధ్యలో ఉన్న ఈ అద్భుతమైన రాళ్ళు 390 అడుగుల ఎత్తుతో ఉంటాయి. ఈ భారీ శిలలలో రెండు విభిన్న శిఖరాలను కలిగి ఉన్నాయి, భైరేశ్వర శిఖర మరియు మోహిని శిఖర అనే రెండు ఎత్తైన శిఖరాలను కలిగి ఉంది. గంభీరమైన పశ్చిమ కనుమల కారణంగా యానా గ్రామం ఎక్కువగా రాతితో కూడిన ప్రకృతి దృశ్యాన్ని కలిగి ఉంటుంది. అడవిలోని పచ్చని చెట్లకు వ్యతిరేకంగా అద్భుతమైన నల్లటి గుహలతోకూడిన వ్యత్యాసం ప్రయాణికులకు మరియు పర్యాటకులకు సంపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది.

అద్భుతమైనటువంటి వాతావరణం

యానా గుహల చుట్టూ ఉన్న ప్రాంతం పర్వతాలు, జలపాతాలు మరియు ఒక రకమైన రాతి నిర్మాణాలతో అద్భుతంగా ఉంటుంది. మీరు సాహసాలను, ఉత్కంఠభరితమైన అనుభవాలను ఇష్టపడేవారైతే, యానా గుహలకు పర్యటించండి మరియు ఆ మొత్తం అనుభూతిని వివరించడానికి మీకు మాటలు సరిపోవు. ఇందులో ఉన్న అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఖచ్చితంగా నలుపు రంగు. ఇంత అందమైన, సహజమైన నిర్మాణాన్ని సృష్టించిన అద్భుతమైన శక్తులను నిశితంగా పరిశీలించినట్లైతే మీరు ఖచ్చితంగా నమ్మలేరు.

నమ్మశక్యం కానీ పురాణ కధలు

యానా గుహల చరిత్రలో హిందూ పురాణాల గురించిన ప్రస్తావన ఉంది. భస్మసురుడు అనే రాక్షస రాజుకు శివుడు వరం ఇచ్చాడని, అతడు తలపై చేయి వేసి ఎవరినైనా కాల్చి చెంపేవాడని కథలో చెప్పబడుతుంది. ఈ వరం వల్ల , దానవుల శక్తి పెరిగిపోవడంతో, అందరు చింతించటం ప్రారంభించారు. విష్ణువు అప్పుడు ఒక ప్రణాళికను రూపొందించి, అతను మోహిని అనే సమ్మోహనమైన యువతిగా రూపాంతరం చెంది మరియు చివరికి ఆ భాస్మసురుడిని అతని తలపై తానే చేయి వేసి తన జీవితాన్ని ముగించుకోనేల మోసగిస్తాడు. ఈ మొత్తం సంఘటన కారణంగా, భస్మసుర బూడిద నుండి గుహలు నల్లగా మారాయి అని చెప్తారు.
యానా కేవ్స్ కంటికి ఒక మంచి ట్రీట్, ఈ భౌగోళిక దృశ్యం అద్భుతమైన చరిత్రతో మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తుంది. కర్ణాటకను సందర్శించేటప్పుడు ఈ అద్భుతమైన ప్రదేశాన్ని మిస్ అవ్వకండి.